96 వర్కవుటైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు సౌత్ స్క్రీన్ దుమ్ములేపిన గ్లామర్ భామ త్రిష గత కొంతకాలం ఎత్తుపల్లాల కెరీర్‌నే సాగిస్తోంది. హిట్టుకి కేరాఫ్ అడ్రెస్‌లాంటి బ్యూటీ కొన్ని రోజులుగా సరైన హిట్ కోసం ఎదురు చూపులు చూస్తోంది. పెద్ద హిట్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆశపడిన త్రిష, హరర్ ట్రెండ్‌ను భుజానికెత్తుకుని మోహిని, నాయకిలాంటి ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. ట్రెండ్‌ను వదలకుండానే, ఈసారి కాస్త వైవిధ్యమైన ప్రయత్నంగా ‘96’ టైటిల్‌తో సినిమా చేసింది. ఈ టైటిల్ జనాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తించడం తెలిసిందే. 69గా ప్రాముఖ్యమైన నెంబర్‌కు రివర్స్‌గా 96 ఎందుకు పెట్టారా? అన్న చర్చ పరిశ్రమలో సాగింది. దీనర్థం -ఎడమొగం, పెడమొగం అన్నమాట. ఈ చిత్రం కోసం కెరీర్ రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్న విజయ్ సేతుపతితో జోడీకట్టిన త్రిష. తాజాగా విడుదలైన ‘96’ సినిమా వర్కవుటైందట. తొలి షో నుంచే హిట్ టాక్ అందుకోవడంతో త్రిష దశ తిరిగినట్టేనని అంటున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సొంతం చేసుకున్నాడు. దాదాపు దశాబ్దకాలం పైగా సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ త్రిష వరుస ఫ్లాపులతో కాస్త గ్యాప్ తీసుకున్నా, తాజా హిట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినట్టే. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కుర్ర హీరోయిన్లతో పోటీపడుతూ త్రిష తన కెరీర్‌ను ఎలా పరుగు పెట్టిస్తుందో చూడాలి.