మనకూ.. మీ టూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు కొన్ని తరహా సమస్యలు సమర్థంగా ఎదుర్కోడానికి ‘మీ టూ’లాంటి ఉద్యమ స్ఫూర్తి మన దేశంలోనూ రావాలంటోంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్. విదేశాల్లో ‘మీ టూ’ పోరాటం పదునుదేరుతోన్న విషయం తెలిసిందే. విడుదలకు సిద్ధమవుతున్న ‘హెలికాప్టర్ ఈలా’లో ఓ వైవిధ్యమైన అమ్మ పాత్రను పోషించింది కాజోల్. ప్రస్తుతం ఆ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. చెడుదార్లు తొక్కకుండా కొడుకును సంరక్షించుకునేందుకు ఉత్సాహవంతమైన తల్లిపడే ఆరాటాన్ని స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన కాజోల్, తాజాగా తనుశ్రీదత్తా- నానాపటేకర్ వివాదంపై స్పందించింది. పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమంటూనే, ఇవి కేవలం చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదని అభిప్రాయపడింది. అన్నిరంగాల్లోనూ ఈ దుస్థితి ఉంది. మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తన సినీ కెరీర్‌లో ఎంతోమంది మగాళ్లతో కలిసి పనిచేసినా, తనకు మాత్రం ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఎదురు కాలేదన్నారు. అందుకు -కారణం నేనెప్పుడూ నా జాగ్రత్తలో నేనున్నాను, ఉంటాను. అలాగే నాముందు అలాంటివి తలెత్తినపుడు తగిన విధంగా స్పందించిన ఘటనలూ లేకపోలేదు. అందుకే విదేశాల్లో మహిళా పోరాటాలు బలోపేతం అవుతున్నట్టు మనదేశంలోనూ ‘మీ టూ’లాంటి ఉద్యమాలు రావాలని అభిప్రాయపడ్డారు. మహిళలు తమ సమస్యలపై పోరాటానికి దిగినపుడే, వేధింపులు, ఆకతాయి దాడులకు బ్రేకులు పడతాయని కాజోల్ అన్నారు.