భారీ విలేజ్ సెట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం మహర్షి. మహేష్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో, ప్రాజెక్టుని ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ కోసం మళ్లీ యూనిట్ అమెరికా వెళ్లనుంది. 20 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుని, మళ్లీ హైద్రాబాద్‌లో మరో షెడ్యూల్ కంటిన్యూ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ కోసం భారీగా విలేజ్ సెట్‌ని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక కథ నడిచేదంతా ఇక్కడేనట. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీరోల్ పోషిస్తున్నాడు. ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేస్తారన్నది యూనిట్ చెబుతోన్న మాట.