కొత్త శృతిహాసన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటమరాయుడు చిత్రం తరువాత -శృతిహాసన్ స్క్రీన్‌మీద కనిపించింది లేదు. నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం అడుగుతున్నా -ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదట. నవంబర్‌లో విడుదల కానున్న ‘శెభాష్ రాయుడు’ చిత్రంలో శృతి కనిపించనుంది. మళ్లీ 2020లో వచ్చే బాలీవుడ్ చిత్రం తప్ప, శృతి చేస్తున్న చిత్రాలేమీ లేవు. ఇందుకు కారణం -శృతి ట్రాక్ మార్చుకుందని అంటున్నారు. సౌత్‌లో గ్లామర్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న శృతిహాసన్ ఫోకస్ -తాజాగా మ్యూజిక్ మీద పడిందని అంటున్నారు. గాయని కూడా అయిన శృతి -పాప్ స్టార్‌గా రాణించాలని ఆశ పడుతోందట. నిజానికి హీరోయిన్ పరంగా శృతి ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుసపెట్టి సినిమాలు ఇప్పుడు ఒప్పుకున్నా -మెయిన్ స్ట్రీంలోకి రాగల సత్తా ఆమెకుంది. కానీ, శృతిమాత్రం మ్యూజిక్ ట్రాక్‌లోనే నడవాలని ఫిక్సయ్యిందట. ఆల్బమ్స్ పాడి, కంపోజ్ చేయటంపై ఆసక్తి చూపుతోన్న ఈ కేజ్రీ గాళ్ -రాక్ స్టార్‌గా రాణించాలనే ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. తండ్రి కమల్ నటించిన ఈనాడు చిత్రానికి మ్యూజిక్ అందించింది శృతిహాసనే. మ్యూజిక్ టీమ్‌ని సెట్ చేసుకునే పనిలో బిజీగావున్న శృతి, ప్రత్యేక ఆల్బమ్ చేసే ఆలచనలో ఉందన్నది ఇండస్ట్రీ టాక్. ఈమధ్య లండన్‌లో ఓ షో కూడా ఇవ్వడంతో, శృతి దాదాపుగా ట్రాక్ మార్చేసినట్టే అని అంటున్నారు. అంటే, ఇక హీరోయిన్‌గా కనిపించదేమో.