మా చౌక బేరమ్ బాగా నచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కిన భలే మంచి చౌకబేరమ్’ అందరికీ నచ్చిందని, చిత్రం మంచి వసూళ్లు రాబడుతుందని చిత్ర సమర్పకుడు కెకె రాధామోహన్ అంటున్నారు. ఆరోళ్ల గ్రూప్ సినిమా ‘్భలే మంచి చౌకబేరమ్’కు కానె్సప్ట్‌ను మారుతి అందించడం తెలిసిందే. నవీద్, నూకరాజు, యామిని భాస్కర్ కీలక పాత్రలతో వచ్చిన చిత్రానికి దర్శకుడు మురళీకృష్ణ. హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా సక్సెస్‌మీట్‌కు యూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. రాధామోహన్ మాట్లాడుతూ ‘మా బ్యానర్‌లో విడుదల చేసిన చిన్న సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది’ అన్నారు. మారుతి మాట్లాడుతూ సినిమా తీయడంకంటే విడుదల చేయడమే కష్టమన్నారు. సినిమా విషయంలో మరుసటి రోజు కలెక్షన్లతోనే కాన్ఫిడెన్స్ వచ్చేసిందని, అనుకున్న టార్గెట్‌ని చేరుకున్నామన్నారు. దర్శకుడు మురళీకృష్ణ మాట్లాడుతూ చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ మాట్లాడుతూ సినిమాను ఆదరించినందుకు అభిమానలు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.