టీజర్‌లోనే సకల కళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనిష్క్‌రెడ్డి హీరోగా శివగణేష్ దర్శకత్వంలో అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. టీజర్‌ను సోమవారం పృథ్వీ (30 ఇయర్స్ ఇండస్ట్రీ) విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ మాట్లాడుతూ హీరో తనిష్క్ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఫైట్స్, డాన్సులు బాగా చేశాడు. మిగతా టీమ్ కష్టపడి పనిచేసింది. ప్రస్తుతం సకల కళా వల్లభుడు సినిమా సెన్సార్ క్లియరెన్స్ కోసం చూస్తోందన్నారు. మరో నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ ఔట్‌పుట్ బాగా ఇచ్చారు. డైరెక్టర్ శివ గణేష్ మంచి మిత్రుడు. ఆర్టిస్టులంతా మంచి సపోర్టు అందించారు. దీని తరువాత బుర్రకథతో వస్తామని, ఏడాదికి రెండు సినిమాలు బ్యానర్ నుంచి వస్తాయన్నారు. డైరెక్టర్ శివగణేష్ మాట్లాడుతూ ఇదొక యాక్షన్ కామెడీ జోనర్. నిర్మాతలు నా ఫ్రెండ్స్ కనుక సపోర్టివ్‌గా నిలిచారు. చిత్రంలో పృథ్వీ కామెడీ హైలెట్. అక్టోబర్-నవంబర్ మధ్య సినిమా రిలీజ్ ఉంటుందన్నారు. హీరో తనిష్క్ మాట్లాడుతూ ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ మూవీ అని, సినిమాలో చిరు పోస్టర్స్, మెగా పవర్‌స్టార్ హెయిర్ స్టైల్, బన్నీ సాంగ్ ఉంటుందన్నారు. ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉందన్నారు. కమెడియన్ పృథ్వీ మాట్లాడుతూ యూత్‌కు కనెక్ట్ అయ్యే చిత్రం సకల కళావల్లభుడు. తనిష్క్ మంచి నటుడే కాదు చాలా కళలు ఉన్నాయ అతనికి. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అన్నారు. తనిష్క్‌రెడ్డి, మేఘల గుప్త, జీవ, పృధ్వీ, సుమన్, చిన్నా తదితరులు నటిస్తున్న చిత్రానికి కెమెరా సాయిచరణ్, సంగీతం అజయ్ పట్నాయక్.