ఆకుచాటున తడవనుందట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎన్టీఆర్’ బయోపిక్ కోసం నందమూరి ఫ్యాన్స్‌తోపాటు తెలుగు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఎన్టీఆర్’ చిత్రం గురించి మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న అంశంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. యన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన దర్శకుడు క్రిష్, తాజాగా మరో విషయంపైనా స్పష్టత ఇచ్చేశాడు. ఎన్టీఆర్ సినీ కెరీర్‌ను శ్రీదేవి లేకుండా చర్చించటం అసాధ్యం. అందుకే ఆ పాత్రకు స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేయబోతున్నట్టు మొదటినుంచీ వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం శ్రీదేవి పాత్రకోసం రకుల్ ఎంపికైంది. ఆమె డేట్లు కూడా ఇచ్చిందని, త్వరలోనే రకుల్, బాలకృష్ణలపై చిత్రీకరణ మొదలుకాబోతున్నట్టు చిత్రం యూనిట్ చెబుతోంది. ఎన్టీఆర్- శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ‘వేటగాడు’ చిత్రంలోని ఆకుచాటు పిందె తడిసె... పాట ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ పాటను ‘ఎన్టీఆర్’ చిత్రంలో రీమిక్స్ చేయబోతున్నట్టు వినికిడి. కీరవాణి ట్యూన్ చేసిన రీమిక్స్‌ను బాలకృష్ణ- రకుల్.. ఎన్టీఆర్- శ్రీదేవి తరహాలో స్టెప్‌లు వేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. యన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించి విశేషాలతో ‘కథానాయకుడు’ పేరిట తొలి భాగం సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ మహానాయకుడు వచ్చే రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.