మళ్లీ.. వినాలనిపించే ‘మోని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, హిందీ ద్విభాషల్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘మోని’. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో లక్కీ ఏకారి, నాజియా హీరో హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఫిలిం ఛాంబర్‌లో విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత సాయి వెంకట్ సీడీ విడుదల చేసి మాట్లాడుతూ, సత్యనారాయణ ఏకారి మంచి టాలెంటెడ్ డైరెక్టర్. గత సినిమా విజయం అందుకున్నట్టే, మోని కూడా సూపర్‌హిట్ అయి నిర్మాతకు ఆనందాన్ని మిగల్చాలని ఆకాంక్షించారు. సమర్పకుడు రంజిత్ కోడిప్యాక మాట్లాడుతూ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్‌టైనర్. దర్శకుడు సత్యనారాయణ ఏకారి అద్భుతంగా తెరకెక్కించాడు. షాలిని, నందికొండ వాగుల్లోనా వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లక్కీ ఏకారి, బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తున్న నాజియా హీరో హీరోయిన్లు. ప్రముఖ టెక్నీషియన్లు పనిచేస్తున్న సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం’ అన్నారు. దర్శకుడు సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ చిత్రంలో రెండు పాటలు, నాలుగు భారీ ఫైట్లు ఉన్నాయి. తప్పకుండా చిత్రం మా బ్యానర్‌లో రెండో చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చేలా ఉంటుందన్నారు. సంగీత దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ చిత్రంలో రెండు పాటలు బాగా వచ్చాయి. రీరికార్డింగ్‌కు మంచి స్కోప్ వున్న సినిమా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది అన్నాడు. హీరో హీరోయిన్లు మాట్లాడుతూ సినిమా సూపర్‌హిట్ అవడంతోపాటు మాకు, టీమ్‌కు మంచి క్రేజ్ తేవాలని ఆకాంక్షించారు.