ఈసారి చేసే మాయేమిటో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైతు, సమంత ఈసారి ఏం మాయ చేస్తారోనన్న ఆసక్తి టాలీవుడ్‌లో కనిపిస్తుంది. పెళ్లితో ఇద్దరి బంధం బలపడిన తరువాత స్క్రీన్ మీద మళ్లీ జోడీ కడుతుండటంతో కొత్త చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయ. టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్ సమంత, నాగ చైతన్య పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ మొదలైంది. నాగ చైతన్య 17వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లెంగ్తీ షెడ్యూల్‌లో నాగ చైతన్య, సమంత పాల్గొంటుండగా, వీరి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం. ‘నిన్నుకోరి’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా రావురమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాకి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.