‘రైతు’ బాంధవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా నరసింహారెడ్డి’ ఆన్ లొకేషన్‌లోవున్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్‌లో 151వ చిత్రమిది. జార్జియాలోని అరుదైన లొకేషన్లలో, టాప్ టెక్నీషియన్లతో ప్రస్తుతం మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కేవలం క్లైమాక్స్ సన్నివేశాల కోసం 50 కోట్లు ఖర్చయిందని ఇటీవల ప్రచారమైంది. సినిమా సెట్స్‌పై ఉండగానే చిరు నటించే 152వ సినిమా గురించిన ప్రచారం జోరందుకుంది. వరుస విజయాలతో ఎదురేలేని దర్శకుడిగా పాపులారిటీ తెచ్చుకున్న కొరటాల శివకు మెగాస్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొరటాల శివ ప్రస్తుతం చిరుకోసం స్క్రిప్టును పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. భరత్ అనే నేను తర్వాత కొరటాల దృష్టంతా ఈ ప్రాజెక్టుపైనే నిలిపాడు. మూవీకి కావాల్సిన అన్ని రకాల విషయాల్ని మెగాస్టార్‌తో నేరుగా చర్చిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రారంభం కానుందని, మార్చి లేదా ఏప్రిల్ 2019లో ప్రారంభమయ్యే సూచనలున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం బయటికి వచ్చేసింది. ఇందులో చిరు రైతు బాంధవుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. కథకు తగ్గట్టే ‘రైతు’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారు.