ఇద్దరికీ సెట్టైనట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకున్నట్టే అరవింద సమేత గటెక్కేసింది. భారీ వసూళ్లవైపు పరుగులు తీస్తుంది. ఓవర్సీస్‌లోనూ ఓకే అనిపించుకోవడంతో దర్శకుడు త్రివిక్రమ్ హ్యాపీ. పనె్నండేళ్ల తరువాత కుదిరిన కాంబోకి మంచి ఫలితమే దక్కిందన్న చర్చా ఇండస్ట్రీలో మొదలైంది. దీంతో త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్టు ఎవరితో ఉండొచ్చన్న అంచనాలూ రకరకాలుగా వినిపిస్తున్నాయి. అయితే స్టార్ హీరోలంతా ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ కావడంతో, తదుపరి ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్న బన్నీతో సెట్టయ్యే అవకాశాలు లేకపోలేదన్నది అంచనా. ‘వీరరాఘవ’ అలసట నుంచి విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ -తదుపరి ప్రాజెక్టును రాజవౌళితో చేయాల్సి ఉంది. చరణ్ అయితే బోయపాటి ప్రాజెక్టుతో బిజీ అయిపోయాడు. సాహో షూటింగ్ ముగింపునకు రాకముందే, కొత్త ప్రాజెక్టుతో ప్రభాస్ కూడా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం కుటుంబంతో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న మహేష్, విశ్రాంతి తరువాత 25వ చిత్రంపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీంతో అల్లు అర్జున్ -త్రివిక్రమ్‌కు సెట్టయ్యే అవకాశాలు లేకపోలేదు. తదుపరి చిత్రం బన్నీతో ఉంటుందా? అన్న ప్రశ్నకు త్రివిక్రమ్ ‘వీరరాఘవ’ తరువాత ఆలోచించాలని చెప్పకనే చెప్పాడు. ఎన్టీఆర్ చిత్ర ఫలితాన్ని బట్టి అడుగు ఎటు వేయాలన్నది ఆలోచించుకునే యోచనతో బన్నీ కూడా ఉన్నాడు. తాజాగా వీరరాఘవకు మంచి టాక్ వచ్చింది కనుక, త్రివిక్రమ్ -బన్సీ కాంబో ప్రాజెక్టుకు ప్రాణం వచ్చినట్టేనని పరిశ్రమ పక్షులు చర్చించుకుంటున్నాయి.