మళ్లీ గిల్లాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్న నందమూరి తారక రామారావు జీవిత కథతో సినిమాలు తెరకెక్కించేందుకు ఏకంగా ముగ్గురు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అందులో లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమాకు ప్లాన్ చేశాడట. దాంతోపాటు మరో నిర్మాత కూడా ఎన్టీఆర్‌పై సినిమా మొదలుపెట్టే ప్రయత్నం చేశారు. అందులో తాజాగా ఎన్టీఆర్ పేరుతో బాలయ్య నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఇన్నాళ్లూ ఎన్టీఆర్ సినిమా అంటూ ప్రకటించిన వర్మ ఎందుకో సైలెంట్‌గా ఉండిపోయాడు. మళ్లీ తాజాగా ఆయన రంగంలోకి దిగుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట బయోపిక్‌ని దసరా రోజున మొదలుపెడతానని ట్వీట్ చేసి సంచలనం రేపాడు. ఎన్టీఆర్- లక్ష్మీపార్వతి పెళ్లి ఫొటోను టాగ్ చేయడంతో ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపాడు. ఆ ఫోటోలో చంద్రబాబు కూడా ఉండడం విశేషం. అయితే వర్మ కావాలనే ఈ సినిమా విషయంలో చంద్రబాబుని గిల్లుతున్నట్టు కనిపిస్తుంది. ఇన్నాళ్లూ సైలెంట్‌గావున్న వర్మ ఎందుకు ఇంత హడావిడిగా దసరా రోజున సినిమా మొదలుపెడతానంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వర్మ కావాలనే టిడిపి శ్రేణులను గిల్లే ప్రయత్నం చేస్తున్నాడన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.