ఆనందింపజేస్తుంది... ఆలోచింపజేస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మైల్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’. వబ్బిన వెంకట్రావు నిర్మాత. మల్లె శ్రీనివాస్ సమర్పించిన చిత్రానికి రామస్వామి దర్శకుడు. అర్థనారి ఫేమ్ అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమాచౌదరి కీలక పాత్రధారులు. సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు రామస్వామి మాట్లాడుతూ ‘రచయితగా 40 సినిమాల అనుభవం. మాటలు, కామెడీ ట్రాక్స్‌తోపాటు సహాయ రచయితగానూ పనిచేశా. తొలిసారి ‘మూడుపువ్వులు ఆరుకాయలు’ చిత్రానికి దర్శకత్వం వహించాను. అష్టకష్టాల్లో వున్న చిత్రాన్ని స్నేహితుడు వబ్బిన వెంకట్రావు నిర్మాతగా ఆదుకుంటే, మల్లె శ్రీనివాసరావు సమర్పకులుగా సహకరించారు. ఈ సినిమాను ఆదరిస్తే పరిశ్రమలో చాలామంది చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలు మూడుపువ్వులు ఆరుకాయలు అవుతాయి అన్నాడు. భరత్ బండారు మాట్లాడుతూ ‘ఒక పువ్వుకు ఒక కాయే కాస్తుంది. కానీ మూడుపువ్వులు ఆరుకాయలు అనేసరికి అన్నీ మల్టిపుల్ అవుతున్నాయని అర్థమైంది. సినిమా కలెక్షన్లు కూడా మల్టిపుల్ కావాలి అని ఆకాంక్షించారు. మూడురకాల రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌ని చిత్రంలో చర్చించామన్నారు. వబ్బిన వెంకట్రావు మాట్లాడుతూ ‘పదిహేనేళ్లుగా ఈ దర్శకుడు నాకు స్నేహితుడు. మంచి సినిమా చేశాం. చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నారు. చిత్ర సమర్పకుడు మాట్లాడుతూ సొసైటీకి మంచి సందేశం ఇచ్చే సినిమాను తప్పకుండా ఆదరించాలని కోరారు.