సంపత్‌నందితో గోపీచంద్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ హీరో గోపీచంద్ వరుసగా కొన్ని పరాజయాల తర్వాత ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు కుమార్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రధానంగా లవ్ ఎంటర్‌టైనర్‌తో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఐతే ఈ చిత్రం తర్వాత గోపీచంద్, సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గోపీచంద్‌కి సంపత్ చెప్పిన ఫుల్ స్క్రిప్ట్ బాగా నచ్చిందట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.