మళ్లీ.. ఇలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌లో కొడుకు బాలకృష్ణ సెనే్సషన్ క్రియేట్ చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథ రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం తెలిసిందే. శరవేగంగా సాగుతోన్న షూటింగ్‌లోని స్టిల్స్‌ను సందర్భోచితంగా చిత్రం యూనిట్ బయటకు వదులుతూనే ఉంది. భారీ తారాగణంతో రానున్న బయోపిక్‌లో, కళ్యాణ్‌రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దసరా స్పెషల్‌గా హరికృష్ణ గెటప్‌లోఉన్న కళ్యాణ్‌రామ్ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘విజయం మీది. విజయరథ సారథ్యం నాది. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ’ అంటూ హరికృష్ణ డైలాగ్‌తో విడుదలైన చిత్రానికి నెటిజన్ల నుంచి మంచి రెస్పానే్స వచ్చింది. కళ్యాణ్‌రామ్ తన తండ్రి గెటప్‌లో సరిగ్గా అమిరాడంటూ నెట్టింట వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సినీ కెరీర్‌ను త్యాగం చేసి ఎన్టీఆర్ వెన్నంటేవున్న హరికృష్ణ పాత్ర ఎన్టీఆర్ బయోపిక్‌లో కీలకం. అందుకే ఈ పాత్రపై ఆసక్తి కనిపిస్తోంది.