దీపావళికి ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్‌మనీ కారణంగా సమాజాభివృద్ధి కుంటుపడుతోంది. రాజకీయ నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం బ్లాక్‌మనీని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల సమాజ వ్యవస్థపైన, దేశ ఆర్థిక వ్యవస్థపైన విపరీత ప్రభావం చూపుతోంది. ఇపుడు ఈ అంశాన్ని తీసుకుని ముద్ర చిత్రాన్ని రూపొందించడం జరిగిందని చిత్ర సమర్పకుడు నట్టికుమార్ తెలిపారు. జగపతిబాబు హీరోగా ఎన్‌కె దర్శకత్వంలో క్యూటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నట్టి క్రాంతి సారథ్యంలో నట్టి కరుణ నిర్మిస్తున్న చిత్రం నిర్మాణానంతర పనులు తుది దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు నట్టికుమార్ మాట్లాడుతూ బ్లాక్‌మనీపై పోరాటం చేసే వ్యక్తిగా చిత్రంలో జగపతిబాబు కనిపిస్తారని చెప్పారు.
రాజకీయ నాయకులు బ్లాక్‌మనీని ఎలా సంపాదిస్తున్నారు, దాన్ని ఎన్నికల్లో ఎలా ఖర్చుపెడుతున్నారన్న అంశాన్ని చిత్రంలో చూపించామని వివరించారు. దీపావళికి చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తన్నట్టు చెప్పారు. పోసాని కృష్ణమురళి, రావు రమేష్, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, సోనియ, జ్యోతి, ఆర్‌కె జబర్దస్త్ రాఘవ తదితరులు నటిస్తున్న చిత్రానికి కెమెరా ప్రసాద్‌బాబు, సంగీతం ఎంఎం శ్రీలేఖ.