ప్రాఘ్నేయ చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిఎస్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో గజపతి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రాఘ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు కాదంబరి కిరణ్ క్లాప్ కొట్టారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గజపతి శ్రీనివాస్, సర్లాన రాంబాబు, సన్ మీడియా సీఈవో గంటాస్వామి, హీరోయిన్ షహరి పాల్గొన్నారు. దర్శకుడు గజపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘చిత్రానికి క్లాప్‌నిచ్చిన కాదంబరి కిరణ్‌కు కృతజ్ఞతలు తెలపుతూ, కొత్త, పాత ఆర్టిస్టుల మేళవింపుతో వైవిధ్యమైన, సంగీత ప్రాధాన్యమున్న ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. చిత్రానికి సంగీతం తలారి శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ యలమంచిన ఈశ్వర్ అందిస్తున్నారు.