సాహో’రే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్ పేరు చెబితే అభిమానులకు పూనకం. తోటి హీరోలకు ప్రేమపూర్వక ఈర్ష్య. చిన్న హీరోలకు అలా ఎదగాలన్న కల. ప్రస్తుతానికి ఆఫ్ స్క్రీన్‌లోనూ అతనే -బాహుబలి. రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా స్క్రీన్‌కు వచ్చిన ప్రభాస్ ‘హీరో అంటే వీడేరా’ అనే స్థాయికి ఎదిగాడు. ఆరడుగుల స్ఫురద్రూపం. ఆకట్టుకునే ఆహార్యం. పరిణితి కలిగిన నటనతో తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకుంటూ వచ్చాడు ప్రభాస్.
‘ఈశ్వర్’గా హీరోగేట్రం చేసి తక్కువ టైంలోనే టాప్ హీరో స్థాయికి ఎదిగాడు. రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు నుంచి డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చివంటి భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల మదిలో యంగ్ రెబల్‌స్టార్ అయ్యాడు. ఒక్కో చిత్రంలో ఒక్కో తరహా పెర్ఫార్మెన్స్‌తో ఎదుగుతూ వచ్చిన ప్రభాస్ 2015లో బాహుబలి -ది బిగినింగ్, 2017లో బాహుబలి -ది కంక్లూజన్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించి వరల్డ్ ఆర్టిస్టుల్లో ఒకడిగా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రభాస్, బాహుబలి మహాయజ్ఞంలో ఐదేళ్లపాటు లాక్ అయ్యాడంటే ఆర్టిస్టుగా అతని తెగువను అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్లపాటు కెరీర్ ప్రాజెక్టులు ఆలోచించకుండా కమిట్‌మెంట్‌తో ఉండిపోయి హాలీవుడ్ హీరో స్టయిల్‌కు రీజ్ అవ్వడం ఒక్క ప్రభాస్‌కే సాధ్యమైంది. అదే తరహా కృషి, కమిట్‌మెంట్ రాజవౌళి నుంచీ ఉండటంతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడింది. ‘బాహుబలి’గా మరొకరిని ఊహించుకోలేమంటూ తెలుగు ప్రేక్షకుడు తీర్మానం చేసేశాడు. ప్రభాస్ కమిట్‌మెంట్‌కు కలెక్షన్లతో కేక పుట్టించి ప్రతిఫలం అందించాడు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రికార్డులు సృష్టించిన బాహుబలి భాగాలు రెండున్నర వేల కోట్ల వ్యాపారం చేశాయంటే... ప్రభాస్ ఏస్థాయికి వెళ్లిపోయి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ నటనకు బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఫ్యాన్సీ ఆఫర్లతో ప్రభాస్ వద్ద క్యూకట్టాయి. ఇప్పుడు మరో సెనే్సషన్ ఆవిష్కరించే పనిలో నిమగ్నమయ్యాడు ప్రభాస్. అదే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న -సాహో. ప్రభాస్ స్టామినాపై నమ్మకంతో యువీ క్రియేషన్స్ సంస్థ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది. హైటెక్నికల్ వేల్యూస్‌తో నిర్మితమవుతోన్న చిత్రం ఇప్పటికే టీజర్‌తో తన సత్తా రుచి చూపించింది. ప్రభాస్ లుక్స్‌తో ప్రాజెక్టుపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కనిపించనుంది. ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్టు కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను రంగంలోకి దింపారు. ఇంతింతై వటుడింతైన ప్రభాస్ పుట్టినరోజు నేడు. సందర్భంగా సినిమా మేకింగ్ వీడియో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు.