ఎవ్వరూ నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన తండ్రిపై లేనిపోని అభియోగాలు మోపినంత మాత్రాన పరిశ్రమలో నమ్మేవాళ్లెవరూ లేరంటోంది అర్జున్ కుమార్తె ఐశ్యర్య. ‘నాకు తెలిసి మా నాన్న పబ్‌కే ఎప్పుడూ వెళ్లలేదు. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన పనేదో ఆయన చేసుకుని వెళ్తుంటారు. అలాంటిది తనపట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ శ్రృతి హరిహరణ్ అభియోగాలు మోపినంత మాత్రాన నమ్మేసేవాళ్లు ఎవరూ లేరు’ అంటోంది ఐశ్వర్య. నిబునన్ చిత్రీకరణ సమయంలో అర్జున్ తనపట్ల అసభ్యకరంగా వ్యవహరించాడని, ప్రాజెక్టుకు నష్టం వాటిల్లకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఆ సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదంటూ శ్రుతి ఇటీవల ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించడం తెలిసిందే. శ్రుతి ఆరోపణలపై అర్జున్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, తాజాగా కుమార్తె ఐశ్వర్య తండ్రిపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. ‘నాన్న తన సినిమా స్క్రిప్ట్‌ని మాతో కూడా చర్చిస్తారు. నిబునన్ స్క్రిప్ట్‌లో ఒకటి రెండుచోట్ల ఇబ్బందికర సన్నివేశాలు ఉన్నపుడు, వాటిని తొలగించాలని నాన్న గట్టిగానే వాదించారు. ఆ విషయాన్ని శ్రుతి ఎందుకు ప్రస్తావించదు. ఆమె 5 రోజులపాటు షూటింగ్‌లో పాల్గొంది. ఆ టైం చాలదా? ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోడానికి?. ఆమెను రిసార్ట్‌కో, డిన్నర్‌కో రమ్మని పిలవడానికి మా నాన్న అంత తీరిగ్గా లేడు. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ మా నాన్న పబ్‌కు వెళ్లడమే చూడలేదు. అలాంటిది ఆమెను రిసార్టుకు రమ్మన్నారంటే ఎవరైనా నమ్ముతారా? శ్రుతి సొంత లాభం కోసం వ్యక్తిత్వానే్న ఫణంగా పెడుతున్నట్టుంది. ఆమె పేరు చానెళ్లలో మార్మోగడానికి ఇదే కారణం. నాకు తెలిసి ఏ యువతీ అలా ఆలోచించలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.