ట్రైలర్‌లో బైలంపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హీరో హీరోయన్లుగా హరీష్ వినయ్, అనుష్క తివారి, దర్శకుడిగా పి.జి.రాజ్ పరిచయమవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాన్ని వైజాగ్‌దగ్గర చోడవరంలో షూటింగ్ జరుపుతున్నారు. గురువారం ఫిలిం ఛాంబర్‌లో చిత్రం పోస్టర్ ఆవిష్కరించారు. నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ‘పారిశ్రామికవేత్తనైన నేను సినిమాపై ఆసక్తితో తొలిసారి నిర్మాతగా బైలంపుడి నిర్మిస్తున్నా. మంచి సినిమా నిర్మించాలన్న కల దీంతో నెరవేరుతోంది. బైలంపుడి గ్రామంలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రివేంజ్ డ్రామా ఇది. ప్రతి పాత్ర సహజంగా ఉంటుంది. ఇప్పటివరకు 30 పర్సంట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కథాబలంతో వస్తోన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. అలా ఓ వినూత్నమైన కథతో దాదాపు అంతా కొత్తవారితో తెరకెక్కుతోన్న చిత్రాన్నిఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. మిస్ ఫేమ్ ఇండియా 2018 షాలుసోని మాట్లాడుతూ ‘బ్రహ్మానందరెడ్డి ఒక మంచి కానె్సప్ట్‌తో సినిమా చేస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ బావుంది. టీమ్ అందరికీ ఆల్‌ది బెస్ట్’ అన్నారు. చిత్ర ప్రమోటర్ శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ ఇందులో జానపద నృత్యంతో సాంగ్ ఉంటుందని, దాన్ని త్వరలో విడుదల చేయబోతున్నామన్నారు. ఆ సాంగ్‌కు ఎవరైనా డాన్స్ కంపోజ్ చేసి పంపిస్తే నగదు బహుమతితోపాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో వారితో పెర్ఫార్మ్ చేయిస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లో డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ చిత్రంలో నిర్మాత బ్రహ్మానందరెడ్డి మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జనవరిలో సినిమాను విడుదలచేయాలన్న ఆలోచనలోఉన్నాం’అన్నారు. డైలాగ్ రైటర్ సాయి మాట్లాడుతూ బైలంపుడి గ్రామం నిజంగానే ఉంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని సినిమాచేశాం. రియలిస్టిక్‌గా ఉంటుంది. పలు చిత్రాలకు కెమెరామేన్‌గా పనిచేసిన అనిల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని’ అన్నారు.