ఆ పాటకు సాటేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం గర్వించదగిన గాయకుల్లో గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కూడ ఒకరు. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఘంటసాల’ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. సిహెచ్.రామారావు దర్శకుడు. యువ గాయకుడు కృష్ణచైతన్య ఘంటసాల పాత్రలో, మృదుల ఘంటసాల సతీమణిగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా.. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘ఘంటసాలకు సంబంధించిన నిజాలు చాలామందికి చాలావరకు తెలియవు. ఆయన పాటలే కాదు.. ఆయన వ్యక్తిత్వం గురించి తెలియాల్సిన నిజాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వాచ్ లోపల ఎందుకు పెట్టుకునేవారు.. రుమాలు ఎలా కట్టుకునేవారు.. ఎలా కూర్చునేవారు.. సాంగ్ రికార్డింగ్‌లో ఎలా కూర్చునేవారు. ఇలాంటి విషయాలు నేటితరం వారికి తెలియవు. అలాంటి విషయాలు ఎన్నో తెలియాల్సిన అవసరం ఉంది. సినిమా సెన్సార్ కావడానికి ముందే ఘంటసాలగారి భార్య సావిత్రమ్మకు సినిమా చూపించి ఏమైనా మార్పులుంటే చేస్తే మంచిది. లేకుండా చాలామంది రంధ్రానే్వషణ చేస్తుంటారు. కాబట్టి ఈ సమస్యలేకుండా ఉండేలా దర్శకులు రామారావుగారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. సంగీతంలో పద్యాలు ఎలా పాడడాలో నేర్పించింది ఆయనే.. వృత్తిపరంగానే కాదు వ్యక్తిత్వంలోకూడా ఎంత వినయంగా ఉండాలి.. ఎలా సంస్కారంగా ఉండాలనే దాన్నికూడా ఆయనదగ్గరే నేర్చుకోవాలి. కృష్ణుడంటే భారతం.. రామాయణం అంటే రాముడు.. పాటలంటే ఘంటసాల అని అందరూ అనుకునేవారు. ఆయన్ని నా తండ్రి సామాన్యుడిగా భావిస్తుంటాను. గురుతుల్యుడు... ఎందరో ఆయననుండి స్ఫూర్తిపొందిన వారే కాదు.. సహాయం పొందినవారు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని నేను ఆవిష్కరించాను. ఆయనలా పాడటం ఎవరికీ సాధ్యంకాదు. ఘంటసాల తర్వాతే.. ఎవరైనా గొప్పగా పాడుతున్నారని అంటారు. కానీ.. ఘంటసాలంత గొప్పగా పాడుతున్నారని ఎవరూ చెప్పరు. చెప్పలేరు.. చెప్పకూడదు కూడా. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఘంటసాలగారు పాటలంటే నాకు చాలా ఇష్టం. అమర గాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. ఆయన బయోపిక్ ఘన విజయం సాధించాలి. గాంధీ, సావిత్రి చిత్రాలకంటే ఘంటసాల చిత్రం పెద్ద సక్సెస్ కావాలి’ అన్నారు.