కార్తీ’దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకరర్ దర్శకుడు. చిత్రంలో కార్తీ స్టైలిష్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు. చేతిలో హెల్మెట్, వెనుక రేసింగ్ బైక్‌తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్‌సింగ్, నిక్కీ గల్రాని హీరోయిన్లు. ఖాళీ తరువాత కార్తీ, రకుల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై పెద్ద అంచనాలున్నాయి. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో కనిపించనున్న సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. చెన్నై, హైదరాబాద్, ముంబై, హిమాలయాలవంటి ప్రదేశాల్లో తెరకెక్కిన సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తున్న సినిమా తెలుగు హక్కులను నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకున్నారు. యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమాని డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.