ఇప్పటికీ.. అదే క్రేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగార తార షకీల. 90లలో యూత్‌ను పిచ్చెక్కించిన స్టార్. షకీలా సినిమా వస్తుందంటే? స్టార్ హీరోల సినిమాలు సైతం వాయిదా పడిన సందర్భాలు లేకపోలేదు. ముఖ్యంగా కన్నడ, తెలుగు, మలయాళం భాషల్లో షకీలా సినిమాలకు పిచ్చి గిరాకీ. షకీలా సినిమా పోస్టర్ గోడమీద పడిందంటే చాలు యువతనుంచి పండుముసలి వరకూ థియేటర్‌వైపు సైకిళ్లు మళ్లించేవారు. షకీలా సినిమా తెలుగు డబ్బింగ్ టైటిల్స్ అంతే క్యాచీగా ఉండేవి. కాలక్రమేణా ఆ టైపు సినిమాలకు గిరాకీ తగ్గడం.. షకీలా వయసు ముదిరిపోవడం.. అలా షకీలా సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చింది. షకీలా అంత పెద్ద స్టార్ అయింది కాబట్టే ఆమె జీవితం ఇప్పుడు వెండి తెరకెక్కుతోంది. ఇంద్రజిత్ లంకేష్ ఆమె జీవిత కథకు దృశ్యరూపం ఇస్తున్నాడు. షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చద్దా పోషిస్తోంది. ప్రస్తుతం రిచా షకీలాలో నటించడానికి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అలాగే సినిమాలో షకీలా గురించి చాలా కీలకమైన అంశాలను ఇంద్రజిత్ చూపించనున్నాడని తెలుస్తోంది. షకీలా అడల్ట్ స్టార్‌గా మారడానికి కారణం తెరపై చాలా ఆసక్తికరంగా చూపించనున్నార్ట. అప్పటి ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉండేది? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నాలు చేసేటప్పుడు షకీలా ఎలాంటి పరిస్థితుల్లో ఉండేది? అవకాశాల కోసం చేసిన ప్రయత్నాల్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు? చాలా ఆసక్తికరంగా మలచినట్టు చెబుతున్నారు. అలాగే షకీల ఇందులో కామియో రోల్ పోషించనుందట. షకీలాకు ఆమె రోల్ ఎలా ఉండబోతోందో ఇంద్రజిత్ నేరెట్ చేయగానే వెంటనే ఒప్పుకుందట. దీంతో సినిమాకు మరింత క్రేజ్‌దక్కే అవకాశం ఉంది.