ఆ ఇమేజ్ మంచిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్‌లో అందరూ ఫైర్‌బ్రాండ్ అనీ పిలిచే హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది వరలక్ష్మి. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, హీరోయిన్‌గానే కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇటీవలే పందెంకోడి 2 చిత్రంలో నెగెటివ్ షేడ్‌లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సర్కార్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా వరలక్ష్మి చెప్పిన విశేషాలు...
ఇప్పటివరకూ తెలుగు సినిమాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. శ్రద్ధ పెట్టకపోవడానికి కారణం తమిళంలో బిజీగా వుండడమే. ముఖ్యంగా హీరోయిన్‌గానే కాకుండా రకరకాల పాత్రలు చేయడంతో ఇక్కడ కుదరలేదు.
పందెం కోడి 2లో నెగెటివ్ షేడ్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చాలా బాగా చేశావని అందరూ పొగుడుతున్నారు. నటిగా నాకు హీరోయిన్‌గానే చెయ్యాలనే ఆలోచన లేదు. అన్ని తరహా పాత్రలు పోషించినపుడే సరైన నటిగా గుర్తింపు తెచ్చుకుంటాను.
సర్కార్ చిత్రంలో పొలిటీషియన్‌గా కనిపిస్తాను. చాలా మంచి కధ. జనరల్‌గా మురుగదాస్ సినిమాల్లో ఫిమేల్ పాత్రలకు మంచి స్కోప్ ఉంటుంది. ఆ తరహాలోనే నాకు, కీర్తికి మంచి ఇంపార్టెంట్ వున్న పాత్రలే దక్కాయి.
నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనం నటించినపుడు ఆ ఎమోషన్స్ ఏమిటన్నది మనకు బాగా తెలుసు కాబట్టి దాన్ని పర్‌ఫెక్ట్‌గా పలికించగలం. పందెం కోడి సినిమా కోసం తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమాకు కూడా నాదే సొంత డబ్బింగ్.
ప్రస్తుతం సర్కార్ సినిమాలో నటించడం గర్వంగా ఉంది. నేటి సమాజానికి అవసరమైన సినిమా. ముఖ్యంగా ఓటు విలువ తెలియజెప్పేలా వుంటుంది.
హీరో కార్పొరేట్ స్టైల్‌లో పాలిటిక్స్‌ను డీల్ చేస్తుంటాడు. అలాగని తమిళనాడు పాలిటిక్స్ గురించి ఉండదు. అలాగే రెండోసారి కీర్తి సురేష్‌తో నటించడం ఆనందంగా ఉంది. కానీ ఈ రెండు సినిమాల్లో మా ఇద్దరి కాంబినేషన్‌లో సీన్లు ఉండవు.
పోడా పోడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన నేను, ఇప్పటివరకూ 22 సినిమాలు మాత్రమే చేశాను. అవకాశాల కోసం అడుక్కోవడం నాకు నచ్చదు. ఈ పాత్రను నేను సూట్ అవుతానంటే తప్పకుండా చేస్తాను.
ఫైర్‌బ్రాండ్‌గా కోలీవుడ్‌లో నన్ను పిలవడం ఆనందమే. అయితే ఇది కొన్ని అవకాశాలను కూడా దూరం చేసింది. ఒక సమస్య గురించి మాట్లాడ్డానికి నేను భయపడను. ముఖ్యంగా ఈమధ్య మీ టూ విషయంలో కూడా స్పందించాను. ప్రస్తుతం ఈ విషయంపై పలువురు బహిరంగంగా స్పందించడం మంచి పరిణామమే. ఇలాంటి వేధింపులు ఇంతటితో ఆగిపోతే బాగుంటుంది. ఎప్పుడైనా టాలెంట్‌ను చూసి అవకాశాలు ఇవ్వాలి. అంతేకానీ ఇంకేదో ఆశించడం తప్పు.
విశాల్‌తో నాకు పెళ్లవుతుందంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి విశాల్, నేను మంచి స్నేహితులం. అనవసరంగా మా మధ్య రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను, విశాల్ ఎప్పటికీ పెళ్లిచేసుకోము.
తమిళ్‌లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా చేయాలని అనుకుంటున్నాను. ఇంకో ఐదేళ్ల తరువాత ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా. జయలలిత గారు నాకు స్ఫూర్తి. కమల్, రజనీ ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం తమిళంలో రాజకీయాలు వేడివేడిగా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడను.