కల్కితో ముగ్గురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఎస్‌వి గరుడవేగతో సక్సెస్ అందుకున్న రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న మరో యాక్షన్ మూవీ -కల్కి. గరుడవేగ సంచలన విజయంతో రాజశేఖర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
ఇటీవలే అ!వంటి విలక్షణ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో కల్కి ఇద్దరికీ చాలెంజింగ్ చిత్రమే. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి సి కళ్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు.
1980నాటి కథ, పీరియాడిక్ నేపథ్యం, డిఫరెంట్ కానె్సప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో బెంగుళూరు బ్యూటీ నందిత శే్వత కీలక పాత్ర చేయనున్నట్టు కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే తాజాగా కల్కి చిత్రంలో రాజశేఖర్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలను ఓకే చేసినట్టు సమాచారం. అందులో ఒకరు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ, మరొకరు బాహుబలి ‘ది బిగినింగ్’లో స్పెషల్ సాంగ్‌లో అందాలు ఆరబోసిన స్కార్లెట్ విల్సన్. ఈ ఇద్దరు భామలు కల్కిలో భాగమైనట్టు తాజా సమాచారం.