ఏపీఎఫ్‌సీసీ వైస్‌గా వర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా విజయ్‌వర్మ పాకలపాటి ఎంపికయ్యారు. ద్వితీయ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళగిరి మండలం ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్‌లో ఆదివారం నిర్వహించారు. సమావేశంలో వాణిజ్య మండలి నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి కె సురేష్‌బాబు ప్రకటించారు. అధ్యక్షుడిగా అంబటి మధుమోహన్‌కృష్ణ, ఉపాధ్యక్షుడిగా పీవీఎస్ వర్మ (విజయవర్మ), బి వెంకటేశ్వరరావు, ఎ జయప్రకాశ్, ప్రధాన కార్యదర్శిగా జేవి మోహన్‌గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం శ్రీనాథరావు, సుబ్బారావు కనగాల, జె శ్రీనివాసరావు, కోశాధికారిగా పాలెపు రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మధుమోహన్‌కృష్ణ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటామని అన్నారు. తనను ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల విజయ్‌వర్మ పాకలపాటి సంతోషాన్ని వ్యక్తం చేశారు.