సుక్కూ బ్యానర్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు సుకుమార్ చాలాకాలం క్రితమే సుకుమార్ రైటింగ్ బ్యానర్‌లో నిర్మాణం మొదలెట్టాడు. కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ యువ దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. మొదటి రెండు చిత్రాలు ఒకింత స్లోగానే చేసినా, ఇపుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. సోలో ప్రొడ్యూసర్‌గా కాకుండా పెద్ద బ్యానర్లతో జాయింట్ వెంచర్లకు సుక్కూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ రూట్లో ఇప్పటికే మైత్రీ మూవీమేకర్స్‌తో ఒక సినిమా లాక్ చేసిన సుకుమార్, మరో రెండు మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టనున్నాడట. అందులో ఒకటి జిఎ 2 రైటింగ్స్ బ్యానర్‌పై సుకుమార్, జిఎ 2 బ్యానర్‌పై బన్నీ వాస్‌లు సంయుక్తంగా నిర్మించనున్నట్టు టాక్. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తాడు. కథ, స్క్రీన్‌ప్లే సుకుమార్ బాధ్యత. కుమారి 21 ఎఫ్ దర్శకుడు సూర్యప్రతాప్ దర్శకుడు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ప్రాజెక్టుకు నితిన్ హీరో అన్నది మరో టాక్. అంటే, ఈసారి నితిన్‌కు హిట్ సినిమా లైన్‌లో ఉన్నట్టే. త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని బలంగా వినిపిస్తోంది.