అమ్మే.. ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేశముదురు’ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక, తర్వాత చాలా తెలుగు సినిమాల్లోనే నటించింది. తరువాత ఎందుకో కోలీవుడ్‌కు మకాం మార్చింది. తెలుగులో దాదాపు కనిపించడమే మానేసింది. ఈమధ్య హన్సిక పెళ్లి విషయమై మీడియాలో జోరుగా వార్తలు వస్తుండటంతో ఆమె స్పందించింది. తన వయసు 27 ఏళ్లని, వయసు దాచేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి వ్యవహారం మాత్రం తన తల్లికే వదిలేశానంటోంది. మంచీ చెడూ అమ్మే చూస్తోందని, ఆమె కుదిర్చిన సంబంధం చేసుకోడానికి తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని అంటోంది. గతంలో హన్సికకు శింబుతో ప్రేమ వ్యవహారం జోరుగా సాగి పెళ్లివరకూ వచ్చినట్టు వార్తలు రావడం తెలిసిందే. కానీ శింబు లైఫ్‌లోని మరికొన్ని ప్రేమకోణాలు బయటపడటంతో, హన్సిక ఆ ఆలోచన నుంచి తప్పుకుంది. అందుకే పెళ్లి విషయాన్ని తల్లికే వదిలేశానని చెబుతున్నట్టు ఇండస్ట్రీలో ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, తనకు ఆఫర్లేమీ తగ్గలేదంటోంది హన్సిక. గత ఏడాది 18 కథలు విన్నానని, అందులో నాలుగు మాత్రమే ఓకె చెప్పానంటోంది. అలాగే, ఇకపై గ్లామర్ రోల్స్ చేయదట. ఏ సినిమా ఒప్పుకున్నా, అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తానంటోంది. వీలైతే మహిళా ప్రాధాన్యతా చిత్రాలైనా ఒకేనన్నది హన్సిక ముక్తాయింపు.