‘నటన’ పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిధర్, శ్రావ్యారావు హీరోహీరోయిన్లుగా చేస్తున్న చిత్రం ‘నటన’. భారతీబాబు పెనుపాత్రుని దర్శకత్వంలో కుభేర ప్రసాద్ సినిమా నిర్మిస్తున్నారు. ప్రభుప్రవీణ్ సంగీతం అందించిన సినిమా పాటల ఆడియో సీడీలను శివాజీరాజా, భానుచందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ నిర్మాత ప్రసాద్ అడిగిన వెంటనే లీడ్ క్యారెక్టర్ చేయడానికి భానుచందర్ ఒప్పుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. జీవితం గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రమన్నారు. నిర్మాత కుభేర ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ సినిమా గురించి విడుదల తర్వాత ప్రేక్షకులు మాట్లాడితే బావుంటుందని అభిప్రాయపడ్డారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ ‘సినిమాలో తాను కంపోజ్ చేసి పాడిన పాటకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉందన్నారు. భానుచందర్ మాట్లాడుతూ చాలాకాలం తర్వాత తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉంది. శ్రీలేఖ పాడిన పాట సినిమాకు హైలైట్ అవుతుంది. మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ భారతీబాబు ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. తప్పకుండా సినిమా ఆదరించాలి అన్నారు.