రణబీర్ కావాలట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతాసింగ్ కూతురు సారా అలీఖాన్ తాజా వ్యాఖ్యలు సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కేదార్‌నాథ్ చిత్రంతో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇస్తున్న సారా, తొలి చిత్రంలోనే లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. చిత్రం ట్రైలర్‌లో హీరో సుషాత్ సింగ్ రాజ్‌పుత్‌తో సారా చేసిన లిప్‌లాక్ సీన్లు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్నాయి. తాజాగా ఓ షోకు హాజరైన సారా పెళ్లిపై స్పందిస్తూ -రణబీర్ కపూర్ అంటే ఇష్టమని, కుదిరితే అతనే్న పెళ్లి చేసుకుంటానని ప్రకటించి షాక్ ఇచ్చింది. డేటింగ్ చేయాల్సి వస్తే హీరో ఆర్యన్‌తో చేస్తానంది ఈ క్యూటీ. దీంతో సారా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. సారా అరంగేట్రం చిత్రం కేదార్‌నాథ్‌పై వివాదాలు చుట్టుముడుతుండటం తెలిసిందే. పవిత్రమైన కేదార్‌నాథ్‌లో ప్రేమ ఏంటంటూ మండిపడుతున్నారు. డిసెంబర్ 7న రానున్న కేదార్‌నాథ్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.