యాక్షన్ భైరవిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకింత స్లిమ్ అయిన అంజలి -యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఆనందభైరవిగా వస్తోంది. తక్కువ కాలంలో చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకున్న అంజలి ప్రధాన పాత్రతో కనిపించనున్న చిత్రం -ఆనందభైరవి. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. స్క్రీన్‌కు పరిచయమవుతున్న యంగ్ హీరో అంజలితో జతకడుతున్నాడు. కర్రి బాలాజీ దర్శకత్వంలో హరేవన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రమేశ్‌రెడ్డి ఇటికెల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సరికొత్త పాయింట్, భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకునే చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమవుతోంది. సినిమాకు సంబంధించిన వివరాలు నిర్మాత రమేశ్‌రెడ్డి వెల్లడిస్తూ దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలూ ఇందులో ఉండటంతో చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చామన్నారు. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తామన్నారు. దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ సమాజంలోని ఓ సంఘటన ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నామని, హైదరాబాద్, వైజాగ్, కేరళలోని పలు లొకేషన్స్‌లో షూటింగ్ ఉంటుందని, వినోదం, ఉల్లాసం, ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుందన్నారు. ముఖ్యంగా అంజలి పాత్ర ప్రతి ఇంట్లోని అమ్మాయిని గుర్తుచేసేలా ఉంటుంన్నారు. అంజలి మాట్లాడుతూ దర్శకుడు బాలాజీ చెప్పిన కథ నచ్చి తొలిసారిగా యాక్షన్ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నానన్నారు. ప్రత్యేక పాత్ర పోషిస్తున్న లక్ష్మీరాయ్ మాట్లాడుతూ సినిమాలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నానని, ఇంతవరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందన్నారు. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్‌వున్న పాత్ర చేస్తున్నందుకు హ్యాపీగా ఉందన్నారు.