నాకు పాత్రే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జంటగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో జిఎ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్‌కెఎన్ నిర్మించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మాళవికా నాయర్ చెప్పిన విశేషాలు..

సక్సెస్ ఎంజాయ్

ఎవరికైనా సక్సెస్ నమ్మకాన్ని పెంచుతుంది. ఇప్పుడు అలాంటి నమ్మకమే నాకు టాక్సీవాలా కలిగించింది. ఈ విజయంతో తదుపరి చిత్రాల విషయంలో ఇంకొంత బెటర్‌గా ఆలోచించుకునే అవకాశం దక్కిందనుకుంటున్నాను. ఈ సినిమాలోని పాత్రను బాగా ఎంజాయ్ చేశా. చాలామంది నిడివి తక్కువ ఉందన్నారు. నేను దాని గురించి ఆలోచించను. నాకు పాత్రే ముఖ్యం. దాన్ని ఎంత బాగా ప్రేక్షకులకు అందించగలిగామా అనేదే నా ఆలోచన.
పాత్ర నచ్చింది
ఈ సినిమాలో నా పాత్ర లేకుండా కథను ఊహించలేం. అలాంటి ప్రాముఖ్యత వున్న పాత్ర ఇది. నిజంగా ఇంత మంచి పాత్ర దక్కినందుకు ఆనందంగా ఉంది. ఈ పాత్ర ద్వారా నేను ఏదో టాప్ హీరోయిన్ అయిపోతానని చెప్పడంలేదు. కానీ నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కింది.
ఛాలెంజింగ్ రోల్స్
నటనతో మంచి స్కోప్ వున్న ఛాలెంజింగ్ రోల్స్ అంటే నేను సిద్ధం. అలాగనే అన్నీ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తానని చెప్పను. నా పాత్రకు ప్రాధాన్యత ఇస్తూనే నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఉండాలి.
ఈమధ్యే మహానటిలో మంచి పాత్ర చేశాను. దాంతోపాటు శిశిర లాంటి ఇంటెన్స్ వున్న పాత్ర చేయడం హ్యాపీగా అనిపించింది.
కమర్షియల్ సినిమాల్లో
కమర్షియల్ సినిమాలకు నేనేమీ దూరం కాను. ఉదాహరణకు అర్జున్‌రెడ్డి పక్కా కమర్షియల్ సినిమా. అందులో హీరోకి వున్న ప్రాముఖ్యత హీరోయిన్ పాత్రకు ఉండదు. కాబట్టి అలాంటి పాత్రలు చేయను. మంచి అవకాశమున్న పాత్రలు వస్తే చేస్తా.
మీటూ గురించి..
ఆడవాళ్ళను హర్ట్‌చేయడం అన్నది కేవలం టాలీవుడ్‌లోనే ఉందని నేను అనుకోను. ఇది ప్రతి రంగంలోనూ ఉంది. అయితే మీటూ ఉద్యమం ఆలస్యమైనా మొదలైనందుకు ఆనందంగా ఉంది. పర్సనల్‌గా నాకు ఎలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. బహుశా నాకు చిన్నప్పటినుంచి మా పేరెంట్స్ తోడుగా ఉన్నందుకేమో!
తదుపరి చిత్రాలు
తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు. తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ప్రస్తుతం బేగంపేటలో లిటరేచర్ కాలేజ్ చేస్తున్నాను.

-శ్రీనివాస్ ఆర్.రావ్