పెట్టా పాటలొస్తున్నాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. చిత్రవర్గాల సమాచారంమేరకు ఈ చిత్రంయొక్క ఆడియో డిసెంబర్ 16న విడుదల కానుందట. ఇక డిసెంబర్ 12న రజినీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను కానీ లేదా చిత్రంలోని సాంగ్‌ను కానీ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇదిలా వుంటే రజినీ నటించిన సైన్స్‌ఫిక్షన్ మూవీ ‘2.0’ నవంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. దాంతో కేవలం నెలన్నర గ్యాప్ తేడాతో తలైవా రెండు చిత్రాలతో అభిమానులను అలరించనున్నాడు.