మహర్షి కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు ప్రస్తుతం ‘మహర్షి’లో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇప్పటివరకూ సినిమాలో ఒకే హీరోయిన్ అని అందరూ అనుకున్నారు గానీ వంశీ మాత్రం మరో హీరోయిన్‌ను సెలెక్ట్ చేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమాలో మహేష్ మూడు విభిన్న దశలలో విభిన్న కోణాలలో కనిపిస్తాడు. స్టూడెంట్‌గా.. ఒక కార్పొరేట్ సంస్థకు అధిపతిగా.. రైతుల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నించే వ్యక్తిగా మహేష్ కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో అమెరికాలో కార్పొరేట్ కంపెనీ హెడ్‌గాఉన్న సమయంలో హీరోకు ఒక అమ్మాయి కనెక్ట్ అవుతుందట. ఆ పాత్రకోసమే సోనాల్ చౌహాన్‌ను ఎంపికచేశారట. మహేష్ సినిమాలలో ఛాన్స్‌రావడం అంటే జాక్‌పాట్ కొట్టినట్టేకదా? గతంలో సోనాల్ ‘లెజెండ్’. ‘పండగచేస్కో’, డిక్టేటర్ లాంటి సినిమాల్లో నటించింది. హైదరాబాద్‌లో ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. మరోసారి అమెరికా షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.