చిన్న చిత్రాలకు.. శత గీతగోవిందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై ఇప్పటికి చాలా ప్రేమకథా చిత్రాలు చూశాం. కొత్తగా ఉండే ప్రేమకథా చిత్రాలు విజయం సాధించాయి. రొటీన్ స్టోరీలు కనబడకుండా పోయాయి. అయినా దర్శకులు ప్రేమకథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల్లో గీత గోవిందం ఒకటి. 2018 ఆగస్టు 15న విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. అర్జున్‌రెడ్డి బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా ఎంచుకుంటాడోని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. విజయ్ మాత్రం ఈసారి సోలో, శ్రీరస్తు శుభమస్తులాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించిన పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం పేరుతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది. తొలిసారిగా పరశురామ్ కూడా తన కెరీర్‌లో కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికే మంచి వసూళ్లు లభించిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల జాబితాలో చేరింది. 2018 బెస్ట్ మూవీగా నిలబడింది.