అదీ.. సుబ్రహ్మణ్యపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంప్లెక్స్ ఇండియా ప్రై. లి. పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సుమంత్, అక్కినేని అఖిల్ ట్రైలర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ- ఇలాంటి కథ దొరకడం అంత సులభమేమీ కాదు, సుమంత్ అన్నకు దొరికింది. కంటెంట్ బేస్డ్ సినిమాను ఎంకరేజ్‌చేస్తున్న నిర్మాతలకు అభినందనలు అన్నారు. సుమంత్ మాట్లాడుతూ- దర్శకుడు సంతోష్ మూలకారణం. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథలు నాకు పెద్దగా ఎక్కవు. రెండ్నుర గంటలు కథ వినగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సినిమా నేరేషన్‌లో 80శాతం చెప్పినట్లు తీస్తే హిట్ అవుతుందని చెప్పాను. సినిమా రెడీ అయిపోయింది. త్వరలో సినిమా విడుదల కానుంది. హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ-దర్శకుడు సంతోష్ కథ చెప్పగానే.. థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే నేను సినిమా చేయడానికి ఓకె అన్నాను అన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ-మంచి కథ.. దర్శకుడు సంతోష్ చక్కగా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమాను మూడు నెలల్లో పూర్తిచేశాం. కార్తికేయ కంటే సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ-నిర్మాత సుధాకర్‌రెడ్డిగారే ఈ సినిమాకు కర్త కర్మ క్రియ. వర్క్ పరంగా ఎలాంటి ప్రెజర్ లేకుండా సినిమా బాగా రావడానికి ఎంతగానో తోడ్పడ్డారు. షార్ట్ ఫిలింస్ చేసిన నాకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. అలాంటి సమయంలో సుధాకర్ వెన్నంటే ఉండి సపోర్టుచేశారు. తొలి సిటింగ్‌లో సుమంత్ ఓకె చెప్పారు. కార్తికేయ సీక్వెల్‌లా అనిపించవచ్చు కానీ కాదు, డిఫరెంట్ సబ్జెక్ట్. డివోషనల్ థ్రిల్లర్. అనుగ్రహించే దేవుడు ఆగ్రహిస్తే పరిస్థితి ఏంటి అనేదే కానె్సప్ట్. కొత్తగా ఉంటుంది. శేఖర్ చంద్ర అద్భుతమైన పాటలు, ఆర్‌ఆర్ అందించారు. సినిమాటోగ్రాఫర్ ఆర్.కె.ప్రతాప్ చక్కటి విజువల్స్ అందించారు. సపోర్టు అందించిన అందరికీ థాంక్స్ అన్నారు.