కొత్తగా మా ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ సినిమా ‘కొత్తగా మా ప్రయాణం’. యామిని భాస్కర్ కథానాయిక. ‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం రమణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. యాక్షన్ కంటెంట్‌తోపాటు పంచ్ డైలాగులు వర్కవుటయ్యాయని తాజాగా రిలీజైన టీజర్ చెబుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణ మాట్లాడుతూ-నలుగురికి సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రేమకథ ఇది. నలుగురికి సాయపడే తత్వం వున్న అతడికి ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అంతగా నమ్మకం ఉండదు. అయితే అలాంటివాడు మన సంప్రదాయం విలువను, గొప్పతనాన్ని తెలుసుకుని అటుపై ఎలా మారాడు అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించాం. ప్రియాంత్‌కిది తొలి సినిమానే అయినా చక్కగా నటించాడు. యామిని భాస్కర్ అందచందాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. యువతరాన్ని టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు.