రియల్ లైఫ్‌కు దగ్గరగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా బెక్కం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం ‘హుషారు’. ఈ సినిమాతో శ్రీహర్ష కొనుగంటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డిసెంబర్ 7న ప్రేక్షకులముందుకు రాబోతోన్న నేపథ్యంలో దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మీడియాతో మాట్లాడాడు. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. ఇంజనీరింగ్ పూర్తిచేసి యూకెలో మాస్టర్స్ చేశాను. తరువాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ హుషారు స్క్రిప్టు రాయడం మొదలుపెట్టాను. నాకు బాగా పరిచయమున్న వ్యక్తి సలహా మేరకు బెక్కం వేణుగోపాల్‌ని కలిసి కథ చెప్పాను. ఆయనకు కథ థ్రిల్లింగ్‌గా అనిపించడంతో ప్రాజెక్టు ఓకె అయింది. కథ విషయానికి వస్తే చలాకీగా వుండే నలుగురు ఫ్రెండ్స్ ఒకసారి హాస్టల్‌లో దొంగతనంగా ఒకే బీర్‌ను తాగి తరువాత జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా మనం విడిపోకూడదని నిర్ణయించుకుంటారు. అలా ఉల్లాసంగా సాగిపోతున్న వారి జీవితంలో అనూహ్యంగా కొంత డబ్బు అవసరం వస్తుంది. వారు ఆ డబ్బును ఎలాంటి మార్గం ద్వారా సంపాదించుకొన్నారనేది సినిమా కానె్సప్ట్. ముందు విజయ్ దేవరకొండతో తీదామనుకున్నాను. కాని కొత్తవారితో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. సినిమాలో 90 శాతం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్‌గా తీశాం. నాకు సినిమాపై పూర్తి నమ్మకముంది. నా నెక్స్ట్ స్టోరీ సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ తరువాత దానిగురించి ఆలోచిస్తా.