విక్రమ్‌తో నాని కాంబో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచురల్ స్టార్ నానికి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్‌గా మిగలగా, దేవదాస్ కూడా యావరేజ్‌గా నిలిచింది. మరోపక్క బిగ్‌బాస్ షో యాంకరింగ్ ఇక ఇప్పుడపుడే టీవీ షోల గురించి ఆలోచించకుండా అనుకునేలా చేసింది. ప్రస్తుతం నాని ‘మళ్లీ రావా’ దర్శకుడు గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో జర్సీ సినిమాలో నటిస్తున్నాడు. నాని ఫోకస్ మొత్తం జర్సీపైనే పెట్టి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దాని తర్వాత నాని ఏ సినిమా చేయబోతున్నాడు అని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే నానితో ఒక సినిమా చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంతకాలం కిందటే ఒక కథ వినిపించాడు. ఆ కథకు నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అయితే నాని కమిట్‌మెంట్స్‌వల్ల ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. తాజా వార్త ప్రకారం, నాని విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించబోతున్నారట. ఇప్పటికే ఇద్దరికీ అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు మంచి కథ కుదరడంతో ఈ ప్రాజెక్టు ఓకే చేశారట. ఇష్క్, మనం, 24లాంటి విభిన్నమైన సినిమాలు తీసిన విక్రమ్‌కుమార్‌లాంటి దర్శకుడితో న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే కచ్చితంగా ఆసక్తిరేపుతుంది. ప్రస్తుతం మైత్రి మూవీస్ విజయ్‌దేవరకొండతో డియర్ కామ్రేడ్, సాయిధరమ్‌తేజ్‌తో చిత్రలహరి సినిమాలు చేస్తోంది. వీటి షెడ్యూల్ పక్కనపెట్టి నాని సినిమా ప్రారంభించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.