మేలో.. మహేష్ 26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్‌బాబు సుకుమార్ దర్శకత్వంలో 26వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. అయితే మహేష్ ఈ సినిమాకు మేనుండి వరుసగా డేట్లు ఇచ్చాడు. మహేష్ కాంబినేషన్‌లోని సీన్లను మేనుండి ఫారెన్ లొకేషన్స్‌లో షూట్ చేయనున్నారు. ఇక మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్ కథానాయికగా నటిస్తున్నట్లు ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే చిత్ర బృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. రంగస్థలం సినిమాతో సూపర్ హిట్‌కొట్టి టాప్ డైరెక్టర్‌గా తన స్థానాన్ని సుస్థిరంచేసుకున్న సుకుమార్, అద్భుతమైన స్క్రిప్ట్‌ను తయారుచేశారట. సుకుమార్ చెప్పిన స్క్రిప్ట్ మహేష్‌బాబుకు కూడా బాగా నచ్చిందట. అందుకే వెంటనే ఈ సినిమా చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.