2.ఓ.. వసూళ్ల తుపాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన భారీ విజువల్ వండర్ ‘2.0’. 3డి, 2డి ఫార్మాట్‌లో వచ్చిన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.110 కోట్లు వసూలు చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో రూ.21.5 కోట్లు రాబట్టింది. ఈ సందర్భంగా తెలుగులో సినిమా విడుదల చేసిన ఎన్వీఆర్ అధినేత ఎన్‌వి ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు.
ఎన్‌వి ప్రసాద్ మాట్లాడుతూ 2.ఓ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.21.5 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజూ అన్ని ఏరియాల్లోని థియేటర్స్ హౌస్‌ఫుల్స్ అయ్యాయ. విజువల్ వండర్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు అన్నారు. 2డి ఫార్మాట్‌లో చూసినవాళ్ళు 3డిలో చూడాలని ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ప్రేక్షకులు సినిమాలోని రజనీకాంత్ అవతారాలన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నారని, కొత్త సందేశంతో వచ్చిన సినిమా ఇంకా సంచలన రికార్డులు సాధించాలని కోరుకుంటున్నాం’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ 2.0 చిత్రం అద్భుత విజయాన్ని సాధించిందన్నారు. ఆల్‌మోస్ట్ ఒక పెద్ద హీరో సినిమా తెలుగులో రిలీజ్ అయితే ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో అలా ‘2.0’ చిత్రం కలెక్ట్ చేసిందన్నారు. తమిళ్, హిందీలో నవంబర్‌లో విడుదల చేయడానికి ఫిక్స్‌అయ్యారు కనుక, ఇక్కడా నవంబర్‌లోనే విడుదల చేశాం. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఏ రేంజ్‌కి తీసుకెళ్తారో ఫలితాలే చెబుతున్నాయన్నారు. పిల్లలు, ఫ్యామిలీస్ సినిమాకు ఇప్పుడే వస్తున్నారని, దీంతో సినిమా మరొక లెవల్‌కి వెళ్తుందని అంచనా వేస్తున్నామన్నారు. అద్భుతాన్ని చూసి పెద్దలే ఆశ్చర్యపోతుంటే, ఇక చిన్న పిల్లలకి ఒక విజువల్ వండర్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చన్నారు. దర్శకుడు శంకర్ ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో విజువల్ వండర్‌గా చూపించారని, ఇండియన్ సినిమాలోనే ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంతవరకు రాలేదన్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తయితే చివరి 20 నిమిషాలు మరో ఎత్తు. శంకర్ ఎన్నిచేసినా చివరలో ఫార్ములాను తీసుకొచ్చి రజనీకాంత్‌తో మేజిక్ చూపించారు. ఆ 20 నిమిషాల ట్రెమండస్ ఫీలింగ్‌తోనే ఆడియన్స్ థియేటర్‌నుంచి బయటికి వస్తున్నారు. చూసినవాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నారు. సాధారణంగా ప్రతి సినిమాకీ పైరసీ చూడకండి థియేటర్‌లోనే చూడండి అని చెప్తుంటాం. పైరసీలో చూస్తే ఈ సినిమా ఎవరికీ అర్థం కాదు. తప్పనిసరిగా థియేటర్‌లోనే చూడాలి. కాబట్టి ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందన్నారు. సంక్రాంతి వరకు ఈ సినిమా కంటిన్యూ అవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.