‘సుబ్రహ్మణ్యపురం’లో రానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు వాయిస్ ఓవర్‌తో. ‘సుబ్రహ్మణ్యపురం’ కథను నడిపించడంలో బ్యాక్‌డ్రాప్ వాయిస్‌తో బలమైన పాత్రను పోషించనున్నాడట. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి పర్యవేక్షణలో రానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్‌నిచ్చారు. కంటెంట్ ఉన్న సినిమాల్లో భాగమయ్యే టాలీవుడ్ హల్క్ రానాకు ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ కూడా బాగా నచ్చింది. ‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదులమీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహం తట్టుకోవడం సాధ్యమవుతుందా? ‘సుబ్రహ్మణ్యపురం’లో దాగున్న రహస్యం ఏంటి...? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘సుబ్రహ్మణ్యపురం’ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్‌లు పూర్తయ్యాయి. సెన్సిబుల్ హీరో సుమంత్, ఇషా రెబ్బ జంట ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.