ఇదే సమయమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ చేస్తున్న వెరైటీ చిత్రం -అంతరిక్షం. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రిష్ జాగర్లమూడి సమర్పణంలో ఘాజీ దర్శకుడు సంకల్పరెడ్డి తెరకెక్కిస్తోన్న అడ్వెంచర్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ చేపట్టని కొత్త కానె్సప్ట్, ఫస్ట్ స్పేస్ బ్యాక్‌డ్రాప్ చిత్రంగా తెరకెక్కుతుండటంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. వరుణ్ తేజ్ సరసన ఆదితి రావ్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా అలరించనున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న చిత్రానికి సంబంధించి ‘సమయమా’ అన్న ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను తాజాగా చిత్రబృందం విడదల చేసింది. అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 9000 కెఎంపిహెచ్ టాగ్‌లైన్‌తో వస్తున్న అంతరిక్షం చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.