మా ఆపరేషన్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు కరణం బాబ్జి దర్శకత్వంలో టి అలివేలు నిర్మించిన చిత్రం -ఆపరేషన్ 2019. శ్రీకాంత్, మంచు మనోజ్, సునీల్ నటించిన చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత సమాజ పరిస్థితులకి అనుగుణంగా ఒక ప్రపొజల్‌తో తీసిన చిత్రమన్నారు. మంచి ఓపెనింగ్స్‌తోపాటు, పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కనెక్టైన చిత్రానికి భిన్నమైన రివ్యూలు రావడం ఒకింత అసంతృప్తిగా ఉన్నా, సమీక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్నారు. నిర్మాతలు చిత్రాలను కష్టపడి నిర్మిస్తారని, దీనివల్ల అనేకమంది టెక్నీషియన్లకు లైఫ్ దొరుకుతుందన్నారు. నెగెటివ్ రేటింగ్స్ వల్ల ఆడియన్స్ థియేటర్లకు రాకుంటే అనేకమంది లైఫ్ సమస్యల్లో పడుతుందన్నారు. అయితే, ఆపరేషన్ 2019 చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, సినిమా మొదలైన దగ్గర్నుంచీ లేవకుండా చూస్తున్నారంటే ఆ సినిమా హిట్టేనని అన్నారు. ఈ చిత్రంతో ఎవరికి ఓటేయాలన్న అవేర్‌నెస్ ఆడియన్స్‌కు కలుగుతుందని, అప్పుడప్పుడు ఇలాంటి మెసేజ్ ఓరియంటెండ్ చిత్రాలు చేయాలని అనిపిస్తోందని అన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ సినిమా బాగోలేదని ఎవ్వరూ అనలేదు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. దర్శకుడిగా కాకుండా బాధ్యత కలిగిన పౌరుడిగా ఒక మెసేజ్‌తో సినిమా తీశామన్నారు. సినిమాను థియేటర్‌లో చూడాలని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.