మిస్టరీ.. మీకే తెలుస్తుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించిన ‘సుబ్రహ్మణ్యపురం’ ఆడియో లాంచ్ యూనిట్ సభ్యుల మధ్య సందడిగా జరిగింది. సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ జంటగా నటించిన మూవీతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భగవంతుడి ఉనికి అనేది నమ్మకమనే పునాదుల మీదుంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. ‘సుబ్రహ్మణ్యపురం’లో దాగున్న రహస్యమేంటి...? అన్నవి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్.
కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా నిర్మాతలు రాజ్‌కందుకూరి, మధుర శ్రీ్ధర్, కాంగ్రెస్ నాయకుడు శివకాంత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుర శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ మధుర ఆడియో ద్వారా సినిమా పాటలను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చిందని, సినిమా మంచి విజయం సాధిస్తుందన్నారు. నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. దేవుడు ఉన్నాడా లేదా? దేవుని శక్తి గొప్పదా? మానవ మేథస్సు గొప్పదా? అనేది ఈనెల 7న తెలియబోతుంది. సినిమా తప్పకుండా మీకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌లను అందిస్తుందని నమ్ముతున్నానన్నారు. దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ షార్ట్ఫిల్మ్ మేకర్‌గాఉన్న నేను సుబ్రహ్మణ్యపురం వంటి సినిమా తీసానంటే దానికి కారణం నిర్మాత సుధాకర్‌రెడి. కథ విన్న తరువాత నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. సుమంత్‌కు రెండున్నర గంటలు కథ చెప్పాను. అయిష్టంగా విన్నా వెంటనే ఓకే చెప్పారన్నారు. ఈషా రెబ్బ మాట్లాడుతూ సంతోష్ చాలా టాలెంటెడ్ దర్శకుడు. స్టోరీ చెప్పినప్పుడే అంత గ్రిప్పింగ్‌గా చెప్పాడు. అతను కథ చెప్పినప్పుడు ఆ రోజు అంతా కథే గుర్తుకువచ్చింది. సుమంత్‌తో వర్క్‌చేయడంతో నేను చాలా నేర్చుకున్నాను. ఆయన మంచి నటుడే కాదు, మంచి మనిషి కూడా. ఈ టీంతో వర్క్‌చేయడం సంతోషంగా ఉంది అన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ నాదగ్గరకు తెచ్చిన సుజితాకు థ్యాంక్స్. సంతోష్ వచ్చి కథ చెప్పినప్పుడు టోటల్ ఎంగేజ్ అయ్యాను. సంతోష్ 90 పర్సెంట్ రీచ్ అయ్యాడు. ఇది మామూలుగా చేసే సినిమా కాదు, విఫెక్స్ విషయంలో కూడా ఎక్కడా రాజీపడలేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా బాగా చేస్తున్నారన్నారు.