నాని.. విక్రమ్ @ 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేచురల్ స్టార్ నాని 24వ సినిమా వచ్చే ఫిబ్రవరి 19నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘13బి’, ‘ఇష్క్’, ‘మనం’, ‘24’, ‘హలో’ చిత్రాలకు దర్శకత్వం వహించి సెన్సిబుల్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్‌తో నాని ప్రాజెక్టు ఓకే అయన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు, ‘జనతాగ్యారేజ్’, ‘రంగస్థలం’... వరుసగా సెనే్సషనల్ హిట్స్‌తో హ్యాట్రిక్స్ అందుకున్న భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. దీనిపై నాని ట్విట్టర్‌లో ‘నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరంలో, గర్ల్స్!! దిస్ ఒన్స్ ఫర్ యు’’ అని పోస్ట్ పెట్టాడు. నిర్మాతలు మాట్లాడుతూ నేచురల్ స్టార్ నాని హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమా నిర్మిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. విజువల్స్‌తో వండర్లు చూపించే పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు డీవోపీ. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడిస్తాం. ఫిబ్రవరి 19నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అన్నారు.