కమర్షియల్సే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మిస్తున్న చిత్రం ‘హుషారు’. సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ దక్ష నగార్కర్ మాట్లాడుతూ కమర్షియల్ సినిమాలంటే ఎక్కువ ఇష్టపడే తను, తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టానని చెబుతోంది. -నేను పుట్టింది ముంబైలో. పంచ్‌గనిలో పెరిగా. ఏడాదిపాటు హైదరాబాద్‌లో, రెండేళ్లు బెంగుళూరులో ఉన్నా. ఇప్పుడు ఢిల్లీలో మకాం. అమ్మ కాస్మోటిక్ కంపెనీలో ఎంప్లాయ్. ఆమెతోపాటు నేను ట్రావెల్ చేస్తుండటంవల్ల ఇన్ని స్టేట్స్‌లో తిరిగాను.
ఇక సినిమా విషయానికి వస్తే హోలీగా, నెమ్మదైన మనస్తత్వంలో ఉండే పాత్రలో కనిపిస్తాను. తేజస్ కంచర్ల నా జోడీగా నటించారు. నలుగురు స్నేహితుల కథ. అయితే ఎంటర్‌టైన్‌మెంట్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు. నా తొలి చిత్రం తేజతో ‘హోరాహోరీ’ చేశాను. ఇది నా రెండో సినిమా. తొలి సినిమా పూర్తికాగానే గ్యాప్ తీసుకున్నా. ఈ గ్యాప్‌లో బిబిఎ పూర్తిచేశాను. మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించాను. డైరెక్టర్ శ్రీహర్ష నా ఫొటోలను చూసి నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కి ఈ పాత్ర కోసం సజెస్ట్ చేశారట. నిర్మాత నుంచి ఫోన్ రావడంతో హైదరాబాద్ వచ్చి స్క్రిప్ట్ విన్నా. నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నా. నాకు కమర్షియల్ సినిమాలంటే ఇష్టం. కాబట్టి తెలుగు సినిమాలను ఎక్కువగా ఇష్టపడతానంటోంది.