పెళ్లికి.. తీరిక లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల చందమామగా సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది కాజల్. స్టార్ హీరోలతోపాటు కుర్ర హీరోలతోనూ సినిమాల మీద సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఇమేజ్ తెచ్చుకున్న కాజల్, మంచి పాత్రల కోసం ఎదురు చూస్తోందట. తాజాగా ఆమె కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కవచంలో కనిపిస్తోంది. 7న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా మీడియాతో కాజల్ ముచ్చట్లు.
ఎలా ఎంచుకున్నారు?
ఇది ఒక మంచి కమర్షియల్ మూవీ. సినిమా అంగీకరించడానికి చాలా కారణాలే వున్నాయి. ముఖ్యంగా సినిమాలో నా పాత్ర కీలకం. అదే నన్ను ఈ ప్రాజెక్టువైపు నడిపించింది. ఇప్పటికే చాలారకాల పాత్రలు చేశా. నేను చేస్తున్న మరో భిన్నమైన పాత్ర ఇది.
బెల్లంకొండ శ్రీనివాస్‌తో..
సాయి మంచి వ్యక్తి. సినిమా కోసం కష్టపడ్డాడు. తండ్రి పేరు ఉపయోగించుకొని ఎదగాలనే ఉద్దేశం అతనిలో కనిపించలేదు. స్వతహాగా పైకిరావాలనే తపన వున్న వ్యక్తి. అతని సినిమాలు చూశా. ఈజ్‌తో నటిస్తాడు. తప్పకుండా అతనికి ఈ ప్రాజెక్టు సక్సెస్ ఇస్తుంది.
భారతీయుడు 2లో...
ఇద్దరు గొప్ప వ్యక్తులైన శంకర్, కమల్‌హాసన్ చిత్రంలో నటించే అవకాశం రావడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ప్రస్తుతానికి ఇంతకుమించి ఏం చెప్పలేను. త్వరలోనే నా పాత్ర వివరాలు రివీల్ చేస్తా. నిజంగా ఆ సినిమాలో నటించడం అదృష్టమని చెప్పాలి.
క్వీన్ రీమేక్..
క్వీన్ తమిళ రిమేక్‌లో నటిస్తున్నా. పూర్తిగా లోకల్‌గా సాగే సినిమా. ఎక్కువగా తమిళ ప్రేక్షకులకు కనెక్టవుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలవుతుంది. హిందీలో ఎలాంటి విజయం అందుకుందో అలాంటి విజయం అందుకుంటుందన్న నమ్మకముంది.
తేజ దర్శకత్వంలో..
మరోసారి తేజతో పనిచేయడం మరచిపోలేని అనుభూతి. ఆ చిత్రంకోసం చాలా ఆసక్తిగా పని చేస్తున్నాను. నా కెరీర్‌లోనే ఒక అద్భుతమైన రోల్ తేజ ఇచ్చారు. సవాలుతో కూడుకున్న పాత్ర అది. ఖచ్చితంగా ఆ చిత్రం నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
పెళ్లి గురించి..
ఇటీవలే దీపిక, ప్రియాంకలు పెళ్లిళ్లు చేసుకున్నారు. నాకు కూడా చేసుకోవాలనే వుంది కానీ ప్రస్తుతం నా కెరీర్ బిజీగా మారింది. ఇలాంటి సమయంలో దానిగురించి ఆలోచించడం లేదు.

-శ్రీనివాస్ ఆర్.రావ్