క్రిస్మస్‌కి ధనుష్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి-2’కి సెన్సార్ పూర్తవ్వడంతో -విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్‌ని బుధవారం విడుదల చేసి, క్రిస్మస్ కాన్కగా డిసెంబర్ 21న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. సూపర్‌హిట్ అందుకున్న ‘మారి’కి ఇది సీక్వెల్. బాలాజీ మోహన్ తెరకెక్కించాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రానున్న చిత్రంలో ‘్ఫదా’ ఫేమ్ సాయిపల్లవి హీరోయిన్. యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్న చిత్రాన్ని ధనుష్ సొంత చిత్రం నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇంతకుముందు మారి తెలుగులో ‘మాస్’గా విడుదలైంది. మారి-2 కూడా మాస్-2గా విడుదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే సాయిపల్లవి నటించిన తెలుగు చిత్రం ‘పడి పడి లేచె మనసు’ అదే రోజు విడుదలవుతుంది. అంటే -సాయిపల్లవి రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లకు రానున్నాయన్నమాట.