లవ్ ట్రావెల్లో.. నెక్స్ట్ ఏంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్‌బాబు, పూనమ్ కౌర్, లారిస్సా ప్రధాన తారాగణంగా వైకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి., అక్షయ్‌పురి ప్రొడక్షన్స్ పతాకాలపై కునాల్ కొహ్లి దర్శకత్వంలో రైనా జోషి నిర్మాతలుగా నిర్మించిన చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సందీప్‌కిషన్ మాట్లాడుతూ.. ‘నిర్మాత అక్షయ్‌పూరి చాలా పాజిటివ్ పర్సన్. సినిమాను చక్కగా తీయడమే కాదు.. బాగా బిజినెస్ కూడా చేసుకున్నారు. ఇక డైరెక్టర్ కునాల్ కొహ్లి డైరెక్ట్ చేసిన హమ్‌తుమ్, ఫనా చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఆయన దర్శకత్వంలో తమన్నాతో కలిసి ఈ సినిమా చేయడం హ్యాపీ. సినిమాను బాగా తీశాం. ఎంత బాగా తీసినా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సినిమా చేశాం. నిజాయితీగా చేసిన ప్రయత్నం. సినిమాను సినిమాగా కథకు ఏమవసరమో దానే్న తెరకెక్కించాం. లవ్, సెక్స్ గురంచి ఈ సినిమా ఉంటుంది. చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ సినిమా తీశాం. సెక్స్‌వల్ల కొట్టుకునే బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్... ఫస్ట్ డ్రింక్ నాతోనే తాగాలని కూతుర్ని అడిగే తండ్రి... ఇలాంటి మూమెంట్స్‌ను కునాల్‌గారు తనదైన స్టయిల్‌లో తెరకెక్కించారు. మనీష్‌భట్, లియోన్‌కి థాంక్స్. రెండు క్యారెక్టర్స్‌ను ట్రావెలింగ్ స్టోరీ ఇన్ ఎంటర్‌టైనింగ్‌వే. సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ ‘సినిమాపై పడ్డ ట్యాగ్స్ అన్నింటిని బ్రేక్ చేసి మంచి సినిమాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. లియోన్ అద్భుతమైన సంగీతం అందించారు. సందీప్, నవదీప్ కూల్ కోస్టార్స్. అక్షయ్‌పురితో కలిసి సినిమా చేయాలనుకున్నాను. అది ఈ సినిమాతో నెరవేరింది. కునాల్‌గారు చాలా నైస్ పర్సన్. సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు.